WGL: చెన్నారావుపేట మండలంలోని లింగగిరి శ్రీ చెన్నకేశవస్వామి జాతర సందర్భంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఆలయ పరిసరాలను ఇవాళ పరిశీలించి వారు మాట్లాడారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక పార్కింగ్, క్యూలైన్లు, సీసీ కెమెరాల నిఘా, దొంగతనాల నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.