KMR: కళాకారుల పోరుదీక్ష పోస్టర్‌ను కామారెడ్డి కళాకారులు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ఈనెల 20వ తేదీన దీక్ష జరుగనుందన్నారు. ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఉద్యోగ సాధన కోసం ఈ పోరుదీక్ష చేపడుతున్నట్లు కళాకారుల సంఘం ప్రతినిధులు తెలిపారు.