NLG: అక్రమంగా ఓపియం పాపి హస్క్ అనే మాదకద్రవ్యాన్ని లారీ డ్రైవర్లకు విక్రయిస్తున్న నిందితున్ని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పి కే శివరాం రెడ్డి తెలిపారు. శనివారం చిట్యాల పట్టణ కేంద్రంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నిందితుల వివరాలను మీడియాకు తెలియజేశారు.