హన్మకొండ పోలీస్ స్టేషన్ నుంచి గత నెలలో 3 గంజాయి రవాణాదారులు సిబ్బంది కళ్లుగప్పి పారిపోయిన ఘటనలో విధులపట్ల నిర్లక్ష్యం వెలుగుచూసింది. అనంతరం పారిపోయిన వారిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా తేలిన హెడ్ కానిస్టేబుల్ బుచ్చయ్యతో పాటు కానిస్టేబుళ్లు మధుసూదన్, నాగేశ్, హోంగార్డు రాజులను CP శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేశారు.