WGL: రాష్ట్ర మంత్రి కొండా సురేఖను గీసుకొండ మండలంలోని రాంపూర్ సర్పంచ్ భరత్, సూర్య తండా సర్పంచ్ రాఘవేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. తమ గ్రామాల్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై మంత్రికి ప్రతిపాదనలు సమర్పించి అభివృద్ధికి సంకహరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందిస్తూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.