SS: ప్రజాకవి యోగి వేమన జయంత్యుత్సవాలను ఈనెల 19న రాష్ట్ర పండుగగా ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. మంగళగిరిలో ఈ ఉత్సవాల లోగోను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో CM చంద్రబాబు ఆవిష్కరించారు. గాండ్లపెంట మండలం కటారుపల్లిలో జరిగే ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలిరావాలని సీఎం పిలుపునిచ్చారు.