SRPT: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీది అడ్డు, అదుపు లేని పాలన అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సూర్యాపేట నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు.