KDP: ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ డిమాండ్ చేశారు. శనివారం మైదుకూరులో ఆయన మాట్లాడారు. రెవెన్యూ,గ్రామ సచివాలయాలు, ఆసుపత్రుల్లో అధికారులు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. CM చంద్రబాబు సమస్యలు పరిష్కరించాలని కోరారు.