TPT: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి(UPSIDA)కి చెందిన తొమ్మిది మంది సభ్యుల ప్రతినిధి బృందం, KPMG ప్రతినిధులతో కలసి శనివారం శ్రీసిటీని సందర్శించింది. యుపీలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి కొరకు శ్రీసిటీ నమూనా అధ్యయనం కోసం ప్రధానంగా వీరి పర్యటన సాగింది. బృందానికి శ్రీసిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్. శివశంకర్ సాదర స్వాగతం పలికారు.