కర్నూలు జిల్లాలోని ఖరీఫ్ CCI రికార్డు స్థాయిలో పత్తి కొనుగోలు చేసింది. 5.5 లక్షల ఎకరాల్లో సాగైన పత్తిని కొనుగోలు చేయడంలో కలెక్టర్ ఏ. సిరి, జేసీ నూరుల్ ఖమర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, సీసీఐ శాఖల సమన్వయంతో శనివారం నాటికి 7,23,075 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసి రూ. 566.48 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు.