AP: NTR జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొనకండి సమీపంలో కారు వాగులోకి దుసుకెళ్లింది. ఈ సమయంలో కారులో ఐదుగురు ఉండగా.. స్థానికులు వెంటనే వాగులోకి దూకి వారిని కాపాడారు. అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో నీలకంఠ(హైదరాబాద్) అనే వ్యక్తి అందులో ఇరుక్కుని మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.