మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్లో సీనియర్ నేత మహమ్మద్ జాఫర్ ఉల్లా సిద్ధిక్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి మంగళవారం రాత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.