చెన్నుబోయిన కమలమ్మ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. మహబూబాబాద్ జిల్లా రొయ్యూరులో జన్మించిన ఆమె.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. దొరల అరాచకాలను ఎదురించి, భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. గ్రామీణ మహిళల్లో చైతన్యం నింపి, వారిని పోరాట దిశగా మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. 1985లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.