TG: ఎమ్మెల్యేలు దానం నాగేందర్ రెడ్డి, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ ఉదయం 10 గంటలకు తీర్పు వెల్లడించనున్నారు. రేపు సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనున్న నేపథ్యంలో, అంతకంటే ముందే స్పీకర్ నిర్ణయం వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది.