TG: గ్యాస్ సిలిండర్ల కొరతతో హాస్టళ్లలో కొన్ని ఆహార పదార్థాలను సర్వ్ చేయొద్దని HYD IT కారిడార్ హాస్టళ్ల అసోసియేషన్ నిర్ణయించింది. ‘టీ, కాఫీ, చపాతీ, దోశ వంటివి సర్వ్ చేయొద్దు. కొన్ని కూరలు, ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ కుక్ చేయొద్దు. బేసిక్ మీల్స్ పెట్టండి. ప్రత్యామ్నాయ వంట పద్ధతులను పాటించండి’ అని హాస్టల్ ఓనర్లకు సూచించింది. పలు రెస్టారెంట్లలో కట్టెల పొయ్యి వాడటం గమనార్హం.