MNCL: జైపూర్ మండలంలోని కిష్టాపూర్ DCMS వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తప్పుడు లెక్కలు చూపి ప్రభుత్వం నుంచి రూ. 38 లక్షలు దుర్వినియోగానికి పాల్పడిన నిర్వాహకుడు రమేశ్‌తో పాటు ఆరుగురిపై కేసు నమోదైంది. జిల్లా సివిల్ సప్లై మేనేజర్ శ్రీలేఖ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ధాన్యం కొనుగోలు అక్రమాలపై సీఐ నవీన్ కుమార్ విచారణ చేపడుతున్నారు.