E.G: సంక్రాంతి సందర్భంగా జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సాధికార అధికారి డీఎమ్ఎం శేషగిరి తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 13వ తేదీ నుంచి ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతాయని చెప్పారు. ప్రజల్లో సాంస్కృతిక అవగాహన, శారీరక దృఢత్వం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.