SKLM: కొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన దేశ సంరక్షకుడు గురుబెల్లి రాము, హేమ దంపతులు సంక్రాంతి కానుకగా నిస్సహాయకులకు స్వెట్టర్, మంకీ టోపీలను అందించారు. ముందస్తు సంక్రాంతిని వీరితో జరుపుకోవటం ఆనందంగా ఉందని, ఇందుకు రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమా శంకర్ సహకరించారన్నారు. పండగ వాతావరణం అందరిలో కనిపించిందని తెలిపారు.