BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం అందజేశారు. గుండ్రాతిపల్లి సర్పంచ్ ఎన్నికల్లో తప్పుడు బీసీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని తక్షణమే తొలగించాలన్నారు. రెండో స్థానంలో నిలిచిన గోనే ముకుందను సర్పంచ్‌గా ప్రకటించాలని రవి పటేల్ కోరారు.