సంక్రాంతి పండుగ వేళ వాట్సాప్ గ్రూపుల్లో ఓ లింక్ తెగ వైరల్ అవుతోంది. ‘ఫోన్ పే పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ పోగ్రామ్.. వినియోగదారులకు రూ.5000’ అంటూ ఓ లింక్ వస్తోంది. ఈ లింక్ ఓపెన్ చేస్తే ‘404’ అని వస్తోంది. కాగా, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?