టాటా స్టీల్ చెస్ టోర్నీ బ్లిట్జ్ విభాగంలో అర్జున్ ఇరిగేశి కాంస్యం సాధించాడు. నిహాల్ సరీన్ మెరుగైన ప్రదర్శనతో రజతం సాధించాడు. నిహాల్, అర్జున్ 18 రౌండ్లలో 11 పాయింట్లతో సమమైనప్పటికీ.. టైబ్రేక్‌లో మెరుగైన స్కోరుతో నిహాల్ రెండో స్థానంలో నిలిచాడు. అమెరికా క్రీడాకారుడు వెస్లీ సో (12 పాయింట్లు) టైటిల్ దక్కించుకున్నాడు. మరోవైపు మహిళల పోరులో కరిస్సా యిప్ టైటిల్ గెలుచుకుంది.