EG: రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు గత ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం పట్ల ఏపీ సీపీఎస్ఈఏ జిల్లా అధ్యక్షులు వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. గోపాలపురంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగిలిన సీపీఎస్ ఉద్యోగులందరికీ కూడా ఈ సంక్రాంతిలోపు బకాయిలు చెల్లించి, పెండింగ్ డీఏలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.