AP: రాష్ట్రప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు బకాయి నిధులు విడుదుల చేసింది. మంత్రి సవిత ఆదేశాల మేరకు రూ.5 కోట్ల బకాయిల చెల్లింపునకు ఆప్కో నిర్ణయించింది. ఈ క్రమంలో రేపు సహకార సంఘాలు ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. కాగా ఆప్కో గత నెలలో రూ.2.42 కోట్ల బకాయిలను చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సవితకు చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు ధన్యవాదాలు తెలిపారు.