VZM: వడ్డే ఓబన్న జయంతి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారిణి జె.జ్యోతి శ్రీ వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వడ్డే ఓబన్న నడిచిన మార్గం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.