MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అభివృద్ధి పనులను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్, SP సుధీర్ రామ్నాథ్ కేకన్ ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద జరుగుతున్న పనులు, హరిత హోటల్ క్రాస్ వద్ద సర్కిల్ సుందరీకరణ, ఊరట్టం క్రాస్ వద్ద సౌందర్యం పెంపు పనులు, జంపన్నవాగు వద్ద దుస్తులు మార్చుకునే గదులను పరిశీలించారు.