ADB: పట్టణంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, వడ్డెర సంక్షేమ సంఘం నాయకులతో కలిసి పట్టణంలోని ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీడిత వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకై పనిచేయాలని పిలుపునిచ్చారు.