KRNL: డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం DYFI నిరంతరం పని చేస్తుందని DYFI మండల కార్యదర్శి రాజు తెలిపారు. ఇవాళ పెద్దకడబురులో పోస్టర్ విడుదల చేసి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడినా, అమ్మినా నేరమేనని, యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని సూచించారు. యువతకు అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు.