MNCL: మందమర్రి పాత బస్టాండ్ వ్యాపారుల సంఘం అధ్యక్ష ఎన్నికలు ఇవాళ జరిగాయి. ఈ ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించారు. 335 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 126 ఓట్లు సాధించి కనుకయ్య గెలుపును కైవసం చేసుకున్నారు. పాత బస్టాండ్ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.