NLR: స్వాతంత్య్ర సమర యోధుడు వడ్డె ఓబన్న జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుల్లో వడ్డె ఓబన్న ఒకరని గుర్తు చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో వడ్డె ఓబన్న కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.