సత్యసాయి: జిల్లాలో ఈనెల 12న అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ తెలిపారు. రైతుల భూ సమస్యలకు తక్షణ పరిష్కారం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అడంగల్ సవరణ, మ్యుటేషన్, పాస్బుక్, వారసత్వ నమోదు వంటి సమస్యలు పరిష్కరిస్తారు. రైతులు అవసరమైన పత్రాలతో హాజరుకావాలని అధికారులు కోరారు.