TG: మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ వెల్లడించారు. BJP-జనసేన పొత్తుపై పార్టీ అధినేత పవన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయమని పవన్ చెప్పారని, బలం ఉన్న చోట పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని జనసేనకు బలమైన కేడర్ ఉందన్నారు.