MNCL: క్రీడలపై యువత ఆసక్తిని కలిగి ఉండాలని లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారం సర్పంచ్ రాజేశం అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆ గ్రామంలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులు, యువత చదువు, క్రీడలపై ఆసక్తి పెంచుకుని రాణించాలని కోరారు.