TG: సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తే సహించేది లేదని, కార్పొరేషన్‌తోపాటు సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈనెల 17న నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించారు. రైల్ రోకో, బంద్‌లు, అవసరమైతే నిరవధిక, నిరాహార దీక్ష చేస్తామన్నారు.