TG: మన భవిష్యత్ బాగుండాలంటే పకృతితో కలిసి జీవించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మన పండగలన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉన్నాయని, పంటలన్నీ ఇంటికి చేరే రోజుల్లో సంక్రాంతి పండగ ఏర్పాటు చేసే వాళ్లమని గుర్తు చేశారు. ఈ మధ్య వాతావరణ మార్పుల వల్ల రుతువులు మారుతున్నట్లు ఉందన్నారు. మనుషులు మారుతున్నట్లే రుతువులు మారుతున్నాయని తెలిపారు.