KMM: మధిర మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్గా మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు నియమితులయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు మధిర మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ఈ నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేసి గులాబీ జెండా ఎగురవేయాలన్నారు.