KMM: సంక్రాంతి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముదిగొండ సీఐ మురళి సూచించారు. పండగకు ఊర్లకు వెళ్లే వారు ఇళ్లకు పకడ్బందీగా తాళాలు వేయాలని, విలువైన వస్తువుల విషయంలో భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాలు, కాలనీల్లో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే 100కి కాల్ చేసి స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.