ATP: గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామ సమీపంలో శనివారం ఓ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రామాంజనేయులు అనే రైతును బెదిరించి, రూ. 5,500వేల నగదును ఎత్తుకెళ్లారు. పోతుదొడ్డికి చెందిన రైతు రామాంజనేయులు బైకుపై వ్యవసాయ పనుల నిమిత్తం మార్నేపల్లికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు బైకుపై వచ్చి ఆపారు. తనను బెదిరించి నగదును అపహరించారని రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.