MLG: మేడారం మహాజాతర ఏర్పాట్లు సజావుగా సాగేందుకు రాష్ట్ర మంత్రి సీతక్క మేడారంలో శనివారం అర్ధరాత్రి వరకు మకాం వేసి పనులను సమీక్షించారు. అధికారులు, పోలీస్ యంత్రాంగంతో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని, పోలీసులకు నాణ్యమైన ఆహారం అందించాలని మంత్రి ఆదేశించారు.