ASR: తీగలవలస గ్రామ పంచాయతీలో MGNREGA సోషల్ ఆడిట్ సిబ్బంది DRP బాబురావు గారు గత వారము రోజులుగా వివిధ పనుల నిమిత్తం సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రామ సభ ద్వారా సోషల్ ఆడిట్లో గుర్తించిన పనుల వివరాలను ప్రజలకు చదివి వినిపించారు. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు.