SRCL: తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGLA) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 క్యాలెండర్ను వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఇవాళ వేములవాడలోని తన క్యాంపు కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరించి లెక్చరర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఎన్ఏ జిల్లా శాఖ అధ్యక్షుడు ఆర్ లక్ష్మయ్య పాల్గొన్నారు.