VSP: స్థానిక శిల్పారామం (జాతర)లో ఆదివారం నుంచి ఈ నెల 16 వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి కూచిపూడి, జానపద నృత్యాలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని ఏఓ రమేష్ రెడ్డి తెలిపారు. నృత్యభారతి, సరస్వతీ నృత్య కళామందిరం, జోష్ అకాడమీ తదితర సంస్థల కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని సందర్శకులను అలరించనున్నారు.