BPT: కర్లపాలెం మండలం గణపవరం పరిధిలోని దేవుడు మాన్యం పొలాల్లో శనివారం సగం కాలిన మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని అదే గ్రామానికి చెందిన దాస్ అని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ఇది హత్య లేదా ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.