ఖమ్మం నగరంలో ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మంత్రి తుమ్మల ఖమ్మం VDO’S కాలనీలో నిర్మించిన ఎన్టీఆర్ పార్కును ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం ఖమ్మం 24వ డివిజన్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు.