NLR: కందుకూరు పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో సంక్రాంతి పేరుతో జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని DSP బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. కోడిపందాలు, పేకాట వంటి నేరాల నివారణకు ప్రత్యేక బృందాలు, నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ స్థలాల్లో కోడిపందాలు నిర్వహించినా యజమానులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.