KMR: సాహిత్యం ప్రజల జీవన విధానాన్ని వారి ఆలోచనలను ప్రతిబింబిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్ అన్నారు. జిల్లా దోమకొండ గడికోటలో ఆధునిక తెలంగాణ సాహిత్యం సమాలోచన కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక తెలంగాణ సాహిత్యంపై సమాలోచన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రసంగించారు.