MNCL: జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పతంగుల దుకాణాలను స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష తనిఖీ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమె పలు దుకాణాలను తనిఖీ చేసి యజమానులకు సూచన చేశారు. ప్రమాదకరమైన చైనా మాంజాను అమ్మ వద్దని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.