TG: రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాల వద్ద పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన డిజిటల్ చెల్లింపుల విధానం పర్యాటకులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఫొటో షూట్ల అనుమతి కోసం చెల్లిస్తున్న పేమెంట్లకు సంబంధించి ఎలాంటి రశీదులు అందకపోవడంతో నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉందని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.