ATP: తాడిపత్రి మండలంలో చిరుత పులి సంచరిస్తోందన్న సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతంతో పాటు సమీప పొలాలను అధికారులు జల్లెడ పడుతున్నారు. చిరుత అడుగుజాడల కోసం నిశితంగా పరిశీలిస్తూ పరిసర గ్రామస్థులను అప్రమత్తం చేశారు. పొలాలకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.