NDL: బెస్తవారిపేట ఫ్లైవోవర్ బ్రిడ్జి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయ్యలూరు మెట్టకు చెందిన అల్లా బకాష్ కాసిం పీరాతోపాటు మరొకరు బైకుపై వస్తుండగా కారు ఢీకొంది. ఈ ఘటనలో అల్లా బకాష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.