KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధిలోని 937 సర్వే నంబర్లో జరుగుతున్న భూ ఆక్రమణల పనులను సంబంధిత అధికారులు అడ్డుకోవాలని ఆ గ్రామ పరిధిలోని ఎస్.కే.ఆర్ నగర్ దళితులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 13 ఏళ్ల కిందట అసైన్మెంట్ కమిటీ ద్వారా 937 లోని ప్రభుత్వ భూములను తమకు కేటాయించారన్నారు. కొందరు అన్యాయంగా భూమి చదును పనులు చేశారన్నారు.